ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమసంఘం క్యాలెండర్ ఆవిష్కరణ

మహబూబ్ నగర్ ఉమ్మడి ఆర్టీసీ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంక్షేమ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆదివారం పశు సంవర్ధక, క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ డా. మల్లు రవి అధికారిక నివాసాలలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సంఘం కార్యవర్గ సభ్యులు మంత్రి, ఎంపీలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దార సుందర్, జిల్లా కార్యవర్గం సభ్యులు, వివిధ డిపోల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్