జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ ఉట్కూరు పోలీస్ స్టేషన్ సందర్శన

వార్షిక తనిఖీల్లో భాగంగా నారాయణపేట జిల్లా ఉట్కూరు పోలీస్ స్టేషన్ ను జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ సోమవారం సందర్శించారు. DSP లింగయ్య, సీఐ రామ్ లాల్, ఎస్సై రమేష్ లు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, స్టేషన్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సమస్య తెలుసుకోవాలని, ప్రజల్లో పోలీసులపై నమ్మకం, భద్రత పెంపొందించేలా వ్యవహరించాలని సూచించారు. మహిళల భద్రత, సైబర్ నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్