మక్తల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక

మక్తల్ మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యులుగా వల్లంపల్లి లక్ష్మణ్, శంషుద్దీన్, సరస్వతీ బాయి, హషియా బేగం సోమవారం  ఎన్నికయ్యారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 12 మంది కౌన్సిలర్ల పూర్తి మద్దతుతో ఈ ఎన్నిక ఎలాంటి అడ్డంకులు లేకుండా సజావుగా జరిగింది. మున్సిపల్ కమిషనర్ శ్రీరాములు నూతన సభ్యులకు నియామక పత్రాలు అందజేశారు. అనంతరం పుర చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నూతన సభ్యులను సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్