అచ్చంపేట: సర్పంచ్, వార్డు సభ్యురాలి మధ్య ఘర్షణ

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం జినుకుంటలో 9వ వార్డు సభ్యురాలు కాశమ్మ, సర్పంచ్ పుష్పలత మధ్య సీసీ రోడ్డు నిర్మాణ పనుల విషయంలో ఘర్షణ జరిగింది. అచ్చంపేట-నాగర్ కర్నూల్ ప్రధాన రహదారి నుంచి గ్రామంలోకి రూ. 50 లక్షల ఎన్ఆర్జీఎస్ నిధులతో సీసీ రోడ్డు మంజూరైంది. వార్డు సభ్యురాలు పనులు చేయిస్తుండగా, గ్రామపంచాయతీ తీర్మానం లేకుండా పనులు ఎలా చేస్తారని సర్పంచ్ అడ్డుకోవడంతో ఈ వివాదం తలెత్తింది.

సంబంధిత పోస్ట్