అచ్చంపేట: ఆన్ లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు, ఉప్పునుంతల మండలాల పరిధిలోని ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ మంగళవారం పరిశీలించారు. ఇసుక రీచ్ నిర్వాహకులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్న కలెక్టర్, ఆన్ లైన్ పద్ధతిలోనే ఇసుక రవాణా జరగాలని సూచించారు. అనుమతులు లేకుండా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్