కల్వకుర్తి: హెల్మెట్ ధరించి ప్రాణాలు కాపాడుకోండి: డీఎస్పీ

మంగళవారం నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం తర్నికల్ గ్రామంలో ద్విచక్ర వాహనదారులు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి తమ విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని డీఎస్పీ వెంకటరెడ్డి సూచించారు. స్థానిక సర్పంచ్ వరలక్ష్మి ఆధ్వర్యంలో దాదాపు 100 హెల్మెట్లను వాహనదారులకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్ఐ మాధవరెడ్డి, మాజీ సర్పంచ్ పవన్ కుమార్ రెడ్డి, ఉప సర్పంచ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్