కొల్లాపూర్: కస్తూర్బా గాంధీ పాఠశాల ఆకస్మిక తనిఖీ

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని పెంట్లవెల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సోమవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థినులకు నాణ్యమైన విద్య, పోషకాహారం, మెరుగైన వసతి, పరిశుభ్రత, తాగునీటి సౌకర్యాలను ఆయన పరిశీలించారు. అధికారులకు విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించాలని, పాఠశాల కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్