మున్సిపల్ ఎన్నికలు అత్యంత పారదర్శకంగా నిర్వహించాలి: కలెక్టర్

నాగర్ కర్నూల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. మున్సిపల్ ఎన్నికల పరిశీలకులుగా నియమించబడ్డ రాజ్యలక్ష్మి, భీమ్లా నాయక్ లతో జిల్లా కలెక్టర్ బుధవారం భేటీ అయ్యారు. జిల్లాలోని కల్వకుర్తి, నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియ నేటి నుంచి మొదలైందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల నిర్వహణపై అధికారులకు పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్