నాగర్ కర్నూల్ జిల్లాలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికల కోసం సిబ్బందిని మంగళవారం ర్యాండమైజేషన్ ద్వారా కేటాయించారు. మొదటి, రెండో విడత ఎన్నికలు జరిగే 13 మండలాలకు సంబంధించిన సిబ్బందిని జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆధ్వర్యంలో నియమించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ తెలిపారు. పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని ఆయన ఆదేశించారు.