నాగర్ కర్నూల్: గ్రామ అభివృద్ధికి అడ్డుపడుతున్న సర్పంచ్

నాగర్ కర్నూల్ జిల్లా బల్మూర్ మండలం జినుకుంట గ్రామంలో అక్టోబర్ 2025లో సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ. 50 లక్షల నిధులు మంజూరయ్యాయి. జనవరి 27న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ భూమి పూజ చేశారు. బుధవారం పదో వార్డు మెంబర్ కాశమ్మ డస్ట్ తొలగింపు పనులు చేస్తుండగా, సర్పంచ్ రంగినేని పుష్పలత పనులను అడ్డుకున్నారు. గ్రామ అభివృద్ధికి అడ్డంకిగా మారడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు మెంబర్ కాశమ్మ మాట్లాడుతూ, సర్పంచ్ తనను దుర్భాషలాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్