నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెద్ద ముద్దునూరు గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రెండవ విడత నామినేషన్ల సందర్భంగా, మంగళవారం నామినేషన్ కేంద్రంలో జిల్లా అడిషనల్ ఎస్పీ ఎన్. వెంకటేశ్వర్లు పరిశీలించారు. నామినేషన్లకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు జరిగేలా చూడాలని బందోబస్తులో ఉన్న పోలీసు అధికారులకు, సిబ్బందికి ఆయన ఆదేశాలు జారీ చేశారు.