నాగర్ కర్నూల్: జన గణనను సమర్థంగా నిర్వర్తించాలి

జనగణన 2027 కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించాలని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ సూచించారు. సోమవారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర జనగణన డైరెక్టర్ భారతి హోలికేరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సెన్సెస్ ఫీల్డ్ ట్రైనర్లకు పలు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఫేస్ వన్ గృహాల జాబితా, గృహ గణన నిర్వహణపై దృష్టి సారించారు. జిల్లాలో జనగణన కార్యక్రమాన్ని సమర్థంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ వివరించారు.

సంబంధిత పోస్ట్