నాగర్ కర్నూల్: ఎంపీడీఓ సస్పెండ్.. నూతన ఎంపీడీఓగా రేవంత్ రెడ్డి

ప్రభుత్వ విధుల్లో నిర్లక్ష్యం వహించినందుకు గాను బల్మూర్ ఎంపీడీఓ రాఘవులును జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శనివారం సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో అమ్రాబాద్ ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డిని బల్మూర్ ఇన్చార్జి ఎంపీడీఓగా నియమించారు. ప్రభుత్వ అధికారులు తమ విధులను నిర్లక్ష్యంగా నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్