నారాయణపేట జిల్లా మద్దూరు మండలం మోమినాపూర్ ఎంపీహెచ్ఎస్ లో క్రమశిక్షణా లోపాలను పట్టించుకోనందుకు ప్రధానోపాధ్యాయుడు చెన్నకేశవులు, సీసీఏ నిబంధనలు ఉల్లంఘించినందుకు ఉపాధ్యాయులు స్వామి, గురునాథ్ రెడ్డిలపై సోమవారం జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు సస్పెన్షన్ వేటు వేశారు. ప్రధానోపాధ్యాయుడు విధుల్లో నిర్లక్ష్యం వహించారని, మిగతా ఇద్దరు ఉపాధ్యాయులు నిబంధనలను ఉల్లంఘించారని ఆయన తెలిపారు. ఈ ఘటనతో పాఠశాలలో క్రమశిక్షణా చర్యలు కఠినతరం చేయనున్నట్లు సమాచారం.