వనపర్తి జిల్లాలోని ఎంసీహెచ్, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులను కలెక్టర్ ఆదర్శ్ సురభి మంగళవారం తనిఖీ చేశారు. గర్భిణులకు టిఫా స్కానింగ్, రక్తహీనత నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని వైద్యులను ఆదేశించారు. డయాలసిస్ రోగుల ఇబ్బందులను గమనించి, వార్డును గ్రౌండ్ ఫ్లోర్కు మార్చడంతో పాటు మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు. రోగులకు నాణ్యమైన వైద్యం అందడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.