వనపర్తి జిల్లాలోని అమరచింతలో చేనేత సహకార సంఘం ఎన్నికల షెడ్యూలును ఎన్నికల అధికారి ప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. సభ్యుల అవగాహన కోసం ఈ షెడ్యూల్ను సంఘం బోర్డుతో పాటు తహసిల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ కార్యాలయాల నోటీస్ బోర్డులపై ఉంచినట్లు పేర్కొన్నారు.