కొత్తకోట బీసీ సంక్షేమ వసతిగృహంలో విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో, విద్యార్థుల సంక్షేమం, భద్రతే తమ తొలి ప్రాధాన్యత అని, వారి ఆరోగ్యం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని కలెక్టర్ ఆదర్శ్ సురభి స్పష్టం చేశారు. శనివారం బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖ అధికారులు, విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, కొత్తకోట వసతిగృహంలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని ఆదేశించారు.