వనపర్తి జిల్లా, ఆత్మకూరు పట్టణంలో గ్రామ దేవతల ఉత్సవాల సందర్భంగా జరుగుతున్న పెద్దమ్మ పండుగ ఉత్సవాల నేపథ్యంలో, శాంతిభద్రతల పరిరక్షణ కోసం 25 మంది ప్రత్యేక పోలీసు బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆత్మకూరు సీఐ శివకుమార్ తెలిపారు. ఈ ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని, అదనపు ఎస్ఐలు, కానిస్టేబుళ్లు కూడా ఈ విధుల్లో పాల్గొని నిఘా ఉంచుతున్నారని ఆయన వెల్లడించారు.