ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా సిరాజుద్దీన్ బాధ్యతలు స్వీకరణ

వనపర్తి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా ఎండి సిరాజుద్దీన్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ప్రస్తుతం వనపర్తిలోనే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న సిరాజుద్దీన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అదనపు బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని వివిధ అంశాలపై ఇరువురు చర్చించారు.

సంబంధిత పోస్ట్