వనపర్తి జిల్లా అదనపు ఎస్పీ రాజేష్ మీనా మాట్లాడుతూ, బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని డీఎస్పీ కార్యాలయంలో ముస్లిం మత పెద్దలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా మతసామరస్యంతో పండుగలు జరుపుకునేలా మతపెద్దలు ప్రజల్లో సమన్వయం సాధించాలని ఆయన కోరారు.