వనపర్తి: జూరాల వంతెన.. వేగంగా సాగుతున్న పనులు

జూరాల ప్రాజెక్టు దిగువన రూ. 121 కోట్లతో చేపట్టిన హై లెవెల్ రోడ్డు బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొత్తపల్లి-జూరాల మధ్య 10.5 కి.మీ మేర నిర్మిస్తున్న ఈ వంతెన పూర్తయితే జోగులాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల మధ్య రవాణా సులభతరం అవుతుంది. ముఖ్యంగా గద్వాల-హైదరాబాద్ మధ్య ప్రయాణ దూరం గణనీయంగా తగ్గనుంది. రవాణా కష్టాలు తీరనున్నాయని స్థానిక ప్రజలు బుధవారం హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్