భారీగా పెరిగిన మక్కల ధర

TG: ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల కారణంగా పంటల సాగు తగ్గిపోవడంతో ఉన్న పంటకు మంచి డిమాండ్ ఏర్పడింది. వరితో పాటు మక్కల ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది. తాజాగా వరంగల్‌ (ఏనుమాముల) వ్యవసాయ మార్కెట్లో మక్కలు క్వింటాల్‌కు రూ.3255 పలికింది. దిగుబడి తగ్గి డిమాండ్‌ పెరగడం వల్లే మక్కలకు అధిక రేటు దక్కిందని వ్యాపారులు చెబుతున్నారు. పంటల సాగు తగ్గినా ధరలు ఊరటనిస్తున్నాయని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕