సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్‌లో భారీ మార్పులు!

పర్యావరణ పరిరక్షణ, ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం 'సెంట్రల్ మోటార్ వెహికల్స్ రూల్స్, 1989'లో సవరణలను ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదిత నిబంధనలు ఇథనాల్, బయోడీజిల్, హైడ్రోజన్ ఇంధనాల వాడకాన్ని ప్రోత్సహిస్తాయి. గాలి కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో సాంకేతిక ఇంధన వర్గీకరణలను అప్‌డేట్ చేశారు. హైడ్రోజన్ ఇంధన వర్గీకరణను 'హైడ్రోజన్ + CN' నుండి 'హైడ్రోజన్ + CNG'గా మార్చారు. కొన్ని వాహనాల 'గ్రాస్ వెహికల్ వెయిట్' (GVW) పరిమితిని 3,000 కిలోల నుంచి 3,500 కిలోలకు పెంచారు. బయోడీజిల్ రిఫరెన్స్‌లను B10 నుండి B100 స్థాయికి అప్‌గ్రేడ్ చేశారు.

సంబంధిత పోస్ట్