నెన్నెల మండలం గంగారం గ్రామ సర్పంచ్ సుధ శ్రీనివాస్ సర్పంచ్ పదవి కాలం ఈ నెల 2న ముగియడంతో ఆదివారం యూత్ సభ్యులు, ప్రజలు ఆత్మీయంగా కలిసి శాలువాలు, పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు. ప్రజలకు పదవి కాలంలో చేసిన సేవలను గుర్తు చేస్తూ సుధా శ్రీనివాస్ సేవ గుణాన్ని కొనియాడారు. పదవి లేకున్నా ప్రజా శ్రేయస్సుకు నిత్యం కృషి చేయాలని కోరారు. సుధ శ్రీనివాస్ మాట్లాడుతూ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.