బెల్లంపల్లి పట్టణంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య పర్యటించారు. రోడ్డు వెడల్పులో నిర్వాసితులైన వారికి కేటాయించిన సింగరేణి బంకర్ స్థలాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనాన్ని సందర్శించి, మార్కెట్ భవనం ముందు పార్కింగ్ స్థలం కోసం స్థలం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.