శుక్రవారం బెల్లంపల్లి కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 57 మంది సభ్యులకు గాను 52 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ తెలిపారు. జూనియర్ సివిల్ జడ్జి ముఖేష్ సమక్షంలో, అసోసియేషన్ అధ్యక్షుడు శివకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తూ ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు.