మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని సందర్శించి, రికార్డులు, రిజిస్టర్లను తనిఖీ చేశారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో అందిన భూ సమస్యల దరఖాస్తులను రికార్డులతో సరిపోల్చి, క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కూడా పాల్గొన్నారు.