రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా, బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్‌లో పోలీసులు శుక్రవారం డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. వన్ టౌన్ సిఐ శ్రీనివాసరావు మాట్లాడుతూ, డ్రైవర్ల చూపు మెరుగుపడితే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, చూపు సమస్యలున్న డ్రైవర్లను గుర్తించి వారికి అవసరమైన మందులు, కళ్ళజోళ్లను అందజేశారు.