శనివారం బెల్లంపల్లి మున్సిపల్ సాధారణ సమావేశం చైర్ పర్సన్ దావా స్వాతి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో 24 అభివృద్ధి అంశాలకు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపినట్లు కమిషనర్ తన్నీరు రమేష్ తెలిపారు. రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని కౌన్సిలర్లు కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.