బెల్లంపల్లి: మార్కెట్లో ఫ్లోరింగ్ తోడుతున్న పందికొక్కులు

బెల్లంపల్లి పట్టణంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవనంలో పందికొక్కుల వల్ల సమస్యలు తలెత్తుతున్నాయి. నూతన భవనంలో పందికొక్కులు క్లోరింగులను ధ్వంసం చేయడంతో, మార్కెట్లో పగిలిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల కూరగాయల అమ్మకాలు, కొనుగోళ్లు చేసేవారు అసౌకర్యానికి గురవుతున్నారు. కోట్లాది రూపాయల నిధులతో నిర్మించిన భవనాన్ని పట్టించుకోకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్