మంగళవారం బెల్లంపల్లి పద్మశాలి భవన్‌లో వన్ టౌన్ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బెల్లంపల్లి ఏసీపీ కిరణ్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను తప్పకుండా పాటించాలని సూచించారు. మద్యం సేవించి, సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని ఆయన హెచ్చరించారు. ఈ అవగాహన సమావేశంలో రోడ్డు భద్రతపై డ్రైవర్లకు పలు సూచనలు చేశారు.