బెల్లంపల్లి మండల శివారులోని పోచమ్మ చెరువు వద్ద ప్రధాన రహదారి గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చిన్నపాటి వర్షానికే గుంతల్లో బురద నీరు చేరి నడవడానికి కూడా వీలు లేకుండా పోతోంది. భూదాకలాన్, చంద్రవెల్లి, చిన్న బూద గ్రామాలకు వెళ్లే ప్రజలు ప్రతిరోజూ ఈ దారి గుండా రాకపోకలు సాగిస్తుంటారు. మునిసిపాలిటీ, సింగరేణి అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.