బెల్లంపల్లి: కన్నాల బస్తీలో వీధి దీపాలు వెలగక ఇబ్బందులు

బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కన్నాల బస్తీలో వీధి దీపాలు సరిగా వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని దీపాలు వెలగకపోవడం, మరికొన్ని మొరాయించడంతో రాత్రి వేళల్లో వీధులన్నీ చీకటిమయంగా మారుతున్నాయి. దీంతో విషపురుగులు సంచరిస్తున్నాయని బస్తీవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి, వీధి దీపాలకు మరమ్మతులు చేయడంతో పాటు కొత్త దీపాలను ఏర్పాటు చేయాలని శనివారం వారు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్