ప్లాస్టిక్ వాడకంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్లాస్టిక్ నిషేధంపై స్వచ్ఛందంగా ముందుకు రావాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి. చంద్రయ్య అన్నారు. కాసిపేట మండలం తాటిగూడ గ్రామపంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావుతో కలిసి సందర్శించి, రహదారులు, మురుగు కాలువలు, ఓపెన్ వెల్స్, సామాజిక ఇంకుడు గుంతలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్లాస్టిక్ వినియోగంపై ప్రజలు జాగ్రత్త వహించాలని సూచించారు.