భీమారం గ్రామంలో ‘షీ టీమ్స్’ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల భద్రతపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. లింగ సమానత్వం, బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన అవసరమని ఎస్. ఐ. హైమ అన్నారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆమె సమగ్రంగా వివరించారు. మహిళలు బహిరంగ ప్రదేశాల్లో, పని ప్రదేశాల్లో వేధింపులకు గురైతే 100కు డయల్ చేయాలని సూచించారు.