ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో వరదనీరు గోదావరిలో కలుస్తుంది. బుధవారం రాత్రి వరకు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 20. 175 టీఎంసీలకు చేరింది. ఎగువ ప్రాంతాల నుంచి 87 వేల క్యూసెక్కులు, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 50 వేల క్యూసెక్కులు, కడెం నుంచి 5వేల క్యూసెక్కుల నీరు ఇన్ స్లోగా వస్తుంది. హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ పథకానికి 288 క్యూసెక్కుల నీటిని తరలిస్తుండగా, 23 గేట్లు ఎత్తి 1. 59 లక్షల క్యూసెక్కుల వరద నీరు గోదావరిలోకి వదులుతున్నారు.