జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు సోమవారం జైపూర్ మండలం ఇందారం, రామారావుపేట గోదాములను సందర్శించారు. గోదాముల వద్ద వేచి ఉన్న లారీల నుంచి ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన సూచించారు. రోజుకు కనీసం 50 లారీల ధాన్యం దిగుమతి చేయాలని, ప్రక్రియ వేగవంతం చేయడానికి అవసరమైన హమాలీలను సమకూర్చుకోవాలని ఆయన పేర్కొన్నారు.