చెన్నూర్ మున్సిపాలిటీకి నూతన మున్సిపల్ కమిషనర్‌గా శ్రీ ఎస్. కోటేశ్వరరావు (గ్రేడ్-III) నియమితులయ్యారు. తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ మరియు డైరెక్టర్ డాక్టర్ టి. కె. శ్రీదేవి ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆన్ డ్యూటీ (OD) ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్న శ్రీ ఎన్. మురళీకృష్ణను తక్షణమే రిలీవ్ చేసి, ఇల్లందు మున్సిపాలిటీకి రెవెన్యూ ఆఫీసర్‌గా బదిలీ చేశారు. పోస్టింగ్ కోసం వేచి చూస్తున్న కోటేశ్వరరావు నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ఉత్తర్వుల్లో తెలిపారు.