మంచిర్యాల జిల్లా, చెన్నూర్ లోని క్యాతనపల్లి పురపాలక సంఘ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం జరిగింది. మున్సిపల్ చైర్ పర్సన్ సంధ్యారాణి అధ్యక్షతన, కమిషనర్ మారుతి ప్రసాద్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో పట్టణ అభివృద్ధికి సంబంధించిన రెండు కీలక అంశాలపై చర్చించి, ఏకగ్రీవంగా ఆమోదించారు. కౌన్సిల్ సభ్యులందరూ పట్టణ ప్రగతి కోసం కలిసికట్టుగా పనిచేయడం పట్ల కమిషనర్ హర్షం వ్యక్తం చేశారు.