అధికారులు, సిబ్బంది సమయపాలన పాటిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మందమర్రి మున్సిపల్ కార్యాలయం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. పలు రకాల ఫైళ్లను పరిశీలించిన అనంతరం మందుల నిల్వలు, వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మున్సిపల్ కమిషనర్ రాజలింగు, వైద్య సిబ్బందిని ఆరా తీశారు.