వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు అన్నారు. బుధవారం మందమర్రి మండలం అందుగులపేటలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించి నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి నిబంధనల ప్రకారం ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు.