చెన్నూర్ మండలంలోని కొమ్మెర 33 కెవి లైన్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తులు, చెట్ల కొమ్మలు తొలగించే పనుల నిమిత్తం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడనుంది. ట్రాన్స్ కో ఏఈ శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం, కొమ్మెర ఫీడర్ పరిధిలోని కొమ్మెర, ఆస్నాద్, పొక్కూరు, దుగ్నేపల్లి గ్రామాల్లో ఈ అంతరాయం ఉంటుంది. ప్రజలు సహకరించాలని కోరారు.