జంతు జనన నియంత్రణ కేంద్రం పరిశీలించిన అదనపు కలెక్టర్

జంతు జనన నియంత్రణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని జంతు జనన నియంత్రణ కేంద్రం, డంపింగ్ యార్డును ఆయన పరిశీలించారు. వీధి కుక్కల జనాభాను నియంత్రించేందుకు శస్త్రచికిత్సలను వేగవంతం చేయాలని, కేంద్రంలో జంతువుల సంరక్షణతో పాటు పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జంతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.

సంబంధిత పోస్ట్