హాజీపూర్: వడదెబ్బ నివారణ పై అవగాహన కల్పించాలి

హాజీపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల పంచాయతీ అధికారి సుమన్ తో కలిసి కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. వార్డులు, మందుల నిల్వలు, ల్యాబ్, ఆసుపత్రి పరిసరాలను పరిశీలించారు. వేసవి దృష్ట్యా వడదెబ్బకు గురి కాకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, ఆసుపత్రికి వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. గర్భిణుల ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలోనే జరిగేలా ఆశ, ఆరోగ్య కార్యకర్తల ద్వారా అవగాహన కల్పించాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్