జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం హాజీపూర్ మండలం గుడిపేట, నమ్నూర్ లలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, రైస్ మిల్లులను సందర్శించి ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియలను పరిశీలించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని ఆయన వెల్లడించారు. కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.