శుక్రవారం లక్షెట్టిపేట మండల కేంద్రంలోని జై యోగేశ్వర రైస్ మిల్లును మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం దిగుమతి, సీఎంఆర్ ప్రక్రియను వారు పరిశీలించారు. రైతు సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, నిర్దేశిత సీఎంఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువులోగా పూర్తి చేసేందుకు అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.