ప్రజల నుంచి స్వీకరించిన సాదాబైనామా దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ వి. రాములు అధికారులను ఆదేశించారు. లక్షెట్టిపేట మండల తహసిల్దార్ కార్యాలయంలో సాదా బైనామా దరఖాస్తులు, భూభారతి పోర్టల్ లో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కారంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకొని వచ్చిందని తెలిపారు.