లక్షెట్టిపేట మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదామును మంచిర్యాల అదనపు కలెక్టర్ రాములు, మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల వ్యవసాయ అధికారి కలిసి సందర్శించారు. కొనుగోలు చేసిన వరి ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని, నాణ్యమైన ధాన్యాన్ని మాత్రమే గోదాములకు తరలించాలని, దిగుమతికి సరిపడా హమాలీలను అందుబాటులో ఉంచాలని అధికారులకు ఆదేశించారు.