పోలీసులు రౌడీ షీట్ నమోదు చేసిన మద్దెల భవానికి ప్రగతిశీల మహిళా సంఘానికి ఎలాంటి సంబంధం లేదని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందె మంగ తెలిపారు. శనివారం మంచిర్యాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ మద్దెల భవాని మహిళా సంఘం పేరుతో భూదందాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడుతోందన్నారు. భవాని చేస్తున్న పనులు పీఓడబ్ల్యూ నిభందనలకు విరుద్ధమని, ఆమెకు తమ సంఘంతో సంబంధం లేదని స్పష్టం చేశారు.