మంచిర్యాల రైల్వే స్టేషన్ లో 30వేల కోట్ల ఆదాయం వస్తున్నా ప్రధాన ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఎందుకు ఆపడం లేదని పెద్దపల్లి పార్లమెంట్ ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రశ్నించారు. బుధవారం పార్లమెంట్ సమావేశాల్లో ఆయన మాట్లాడారు. మంచిర్యాలలో వందే భారత్, సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని కోరారు. రైల్వే శాఖ పనితీరుపై ఆయన అసహనం వ్యక్తం చేశారు.